స్థిరలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి

బుధవారం, 1 ఫిబ్రవరి 2012 (15:01 IST)
రమేష్ :

మీరు పాఢ్యమి శుక్రవారం, మేషలగ్నము, కృత్తికా నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్రుడు ఉండటం వల్ల ప్రతీ విషయానికి అధికంగా ఆలోచించడం, స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోవడం, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు.

టెక్నికల్ కోర్సులు చేయండి. రాజ్యాలాభాధిపతి అయిన శని శుక్రునితో కలయిక వల్ల మీకు ఉజ్వలభవిష్యత్తు ఉంది. మీ 25 లేక 26వ సంవత్సరం నందు ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడే అవకాశం ఉంది.

2009 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2012 మే నుంచి 2027 వరకు యోగాన్ని ఇస్తాడు. స్థిరలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి