ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రయాణం కలిసివస్తుంది.
పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మంగళవారం నాడు ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
సత్కాలం సమీపిస్తోంది. ధైర్యంగా ముందుకు సాగండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బుధవారం నాడు మితంగా సంభాషించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహనిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. బాధ్యతగా వ్యవహరించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితులు హితవు కార్మోన్ముఖులను చేస్తుంది. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆదివారం నాడు పనులు, కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. బెట్టింగ్ల జోలికి పోవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. కలుపుగోలుతనంతో మెలగండి. ఎవరినీ కించపరచవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడపుతారు. సోమవారం నాడు పనులు పురమాయించవద్దు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనాలోచితంగా వ్యవహరిస్తే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతలత్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.
మీదైన రంగంలో రాణిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయులతో హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్ధికంగా బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. వ్యవహారానుకూలత ఉంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగులకు ఏకాగ్రత, కృషి ప్రధానం. ఉద్యోగస్తులకు పనిభారం. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం.
వ్యవహారానుకూలత, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. బంధుత్వాలు బలపడతాయి. రావలసిన ధనం సమయానికి అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు మన్ననలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లకండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
ప్రతికూలతలు అధికం. సంప్రదింపులతో తీరిక ఉండదు. ముఖ్యమైన వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఆవేశాలకు లోనుకావద్దు. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. పెద్దల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ధనప్రలోభాలకు లొంగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం కదలికలిపై దృష్టి పెట్టండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఉద్యోగస్తులకు పదవీయోగం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఏకాగ్రతతో మెలగండి. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. శనివారం నాడు పనులు పురమాయించవద్దు. ఇతరుల తప్పిదాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.