స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేయవలసి వస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఓర్పు, పట్టుదలతో అడుగు ముందుకేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవివాహితులకు నిరుత్సాహకరం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
ఈ వారం అనుకూలదాయకం. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీకు బలాన్నిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగపరంగా విశేష ఫలితాలున్నాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకం. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య సఖ్యతలోపం. అందరితోనూ మితంగా సంభాషించండి. బుధవారం నాడు ముఖ్యల కలయిక వీలుపడదు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఓర్పుతో యత్నాలు సాగించండి. సంతానానికి శుభయోగం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగల్గుతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ నిర్ణయం సంతానం భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. విదేశీ సందర్శనలకు యత్నాలు సాగిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ రంగాల్లో ఒత్తిళ్లకు గురికాకుండా చూసుకోండి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. పనుల్లో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు అదుపులో ఉండవు. సోమ, మంగళవారాల్లో ఆచితూచి అడుగేయండి. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. ఆప్తుల జోక్యంతో వ్యవహారం సానుకూలమవుతుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. సంతానం భవిష్యత్తు గురించి అలోచించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించండి. ప్రలోభాలకు లొంగడద్దు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
అన్ని విధాలా అనుకూలమే. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. గురువారం నాడు ఊహించని సమస్య ఎదురవుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో తొందరపాటు తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. మీ యత్నం త్వరలో ఫలిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు ఆకస్మిక బదిలీ.
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. సాయం ఆశించి నిరుత్సాహపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. శనివారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. సంతానం దూకుడు అదుపుచేయండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం చేయండి. ధార్మిక సంస్థలకు విరాళాలందిస్తారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమించి లక్ష్యం సాధిస్తారు. పనులు మునుపటి కంటే వేగవంతమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో ఏకాగ్రతతో మెలగండి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనం తగదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవద్దు. వృత్తిపరంగా విశేష ఫలితాలున్నాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చిన్నవ్యాపారాలు సైతం లాభసాటిగా సాగుతాయి. బెట్టింగ్ కు పాల్పడవద్దు.
కార్యసాధనకు ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అనురాగవాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో గృహం సందడిగా ఉంటుంది. పనులు, కార్యక్రమాలు అప్పగించవద్దు. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్తబాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. ఉద్యోగపరంగా విశేష ఫలితాలున్నాయి. అధికారుల ప్రశంసలందుకుంటారు. దూరప్రయాణం తలపెడతారు.
ఆర్ధికంగా బాగున్నా ఖర్చులు తగ్గించుకోండి. ఆర్భాటాలు, మొహమ్మాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. చేపట్టిన పనులపై శ్రద్ధ వహించండి. మీ ఏమరుపాటు ఇబ్బందులకు దారితీస్తుంది. గురువారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలకపత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. కీలక పదవులు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. సంతానికి శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు సంకల్పబలం ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. పట్టింపులకు పోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. మంగళవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి, అవతలి వారి స్తోమతను తెలుసుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.