02-03-2025 నుంచి 08-03-2025 వరకు మీ వార రాశిఫలితాలు

రామన్

శనివారం, 1 మార్చి 2025 (16:53 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ప్రధానం. ఆశావహదృక్పధంతో మెలగండి. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. ఆదాయం అంతంతమాత్రమే. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. సన్నిహితుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. మీ పట్టుదలే విజయానికి నాంది పలుకుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తగిన సమయం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశయం నెరవేరుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు ధనం అందుకుంటారు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. గురువారం నాడు కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యమైన పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. కొందరి ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు కొత్త సమస్యలు. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహబలం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. రిప్రజెంటేటివ్‌లు, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలున్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అవివాహితులకు శుభయోగం. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. విద్యార్థులకు సమయపాలన ముఖ్యం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ధైర్యంగా ముందుకు సాగండి. అపోహలకు తావివ్వవద్దు. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహదృక్పథంతో అడుగు ముందుకేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. బుధవారం నాడు పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు స్థానచలనం.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయవ్యయాలు సంతృప్తికరం. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా ్పపనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తారు. శుక్రవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహబలం అనుకూలంగా ఉంది. మనోబలంతో యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాఆటలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. శనివారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. చిరువ్యాపారులకు ఆశాజనం. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. వ్యాపకాలు తగ్గించుకోవటం శ్రేయస్కరం. ఆదాయం బాగుంటుంది. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. కీలక విషయాల్లో అలక్ష్యం తగదు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. విదేశీ సందర్శనలకు యత్నాలు సాగిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ఆదివారం నాడు కొందరిరాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతలు అధికం. కష్టించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ప్రియతములతో కాలక్షేపం చేయండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పాతపరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. మంగళవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు