24-05-2020 నుంచి 30-05-2020 వరకు మీ వార రాశి ఫలితాలు- video

శనివారం, 23 మే 2020 (17:46 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం  
ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. బంధువుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. ఇతరుల వ్యాఖ్యలు, విమర్శలు పెద్దగా పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు  
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు సామాన్యం.  
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. ఖర్చులు అదుపులో వుండవు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆది, గురువారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో సంతోషకరమైన వార్తలు వింటారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష  
సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పదవుల స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కులగా అంచనా వేయొద్దు. విలాసాలకు వ్యయం చేస్తారు. చేతిలో ధనం నిలవదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శుక్ర, శనివారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ కించపరచవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. పనులు వేగవంతమవుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యవహారానుకూలత వుంది. అవకాశాలను దక్కించుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సంప్రదింపులకు అనుకూలం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంగి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వైద్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహ దృక్పథంతో మెలగండి. ప్రయత్నాలు విరమించుకోవద్దు. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు తగ్గించుకుంటారు. కుటుంబీకులతో అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన అధికం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి అంతంత మాత్రమే. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఈ చికాకాలు త్వరలో సర్దుకుంటాయి. బుధ, గురువారాల్లో పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాల పట్ల జాగ్రత్త. ఆచితూచి అడుగు వేయండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమీద నెరవేరుతాయి. శుక్ర, శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయం అనివార్యం. మీ సలహా ఎదుటివారికి సంతృప్తినిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంతానం క్షేమం తెలుసుకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఇతరుల సహాయం ఆశించవద్దు. వ్యాపకాలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఓర్పుతో వ్యవహరించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతారు. వ్యాపారాలు పురోగతిని సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉఫాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. రవాణా రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
పరిస్థితిలు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం తలపెడతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. సోమ, మంగళవారాల్లో ఖర్చులు అదుపులో వుండవు. ధన సమస్యలెదురవుతాయి. సహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు చెల్లింపుల వాయిదా వేసుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు పనిభారం, చికాకులు అధికం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విదేశాల్లోని ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు