18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

రామన్

ఆదివారం, 18 మే 2025 (20:06 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తను అర్ధం చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వైద్య, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకోకండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. దంపతుల మధ్య ఆకారణ కలహం. పరస్పర అవగాహనతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు విపరీతం. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. చిన్న విషయానికే అసహనం. చెందుతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోను మనోధైర్యం కోల్పోవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అవివాహితులకు శుభయోగం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్రవారాల్లో పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనవ్యయంలో మితం పాటించండి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సోమవారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పాతమిత్రుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం అనివార్యం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చిన్నపాటి ఒత్తిళ్లున్నా ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. కృషి ఫలించకున్నా అధైర్యపడవద్దు. త్వరలో శుభర్త వింటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. నోటీసులు అందుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. డాక్టర్లు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. సాఫ్ట్వేర్ విద్యార్థులకు కష్టసమయం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగున్నా అసంతృప్తిగా ఉంటుంది. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గురువారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అనవసర బాధ్యతలు చేపట్టిన ఇబ్బందులు ఎదుర్కుంటారు, ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు చేపడతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. మీ అశ్రద్ధ ఇబ్బందులకు దారితీస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. మీ కృషి ఫలిస్తుంది. కార్యానుకూలత, వ్యవహార జయం ఉన్నాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం కృషి ఫలిస్తుంది. అవివాహితులు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలున్నాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. మీ సాయంతో ఒకరికి లబ్ధి కలుగుతుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం గ్రహాల సంచారం బాగుంది. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. కిట్టని వ్యక్తులు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శ్రమతో కూడిన ఫలితాలు సాధిస్తారు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. భేషజాలకు పోవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పెద్దల సలహా పాటించండి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధవహిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దది చేసుకోవద్దు. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు