11-08-2019 నుంచి 17-08-2019 వరకు మీ రాశి ఫలితాలు.. ఆ రాశి వారు మంచి చేయబోతే చెడు?

శనివారం, 10 ఆగస్టు 2019 (14:27 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు రూపొందించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పనులు సానుకూలమవుతాయి. ఆది, గురు వారాల్లో ఒత్తడి, శ్రమ అధికం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించాలి. సంతానం దూకుడు కట్టడి చేయండి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆధ్యాత్మిక సంస్ధలకు సాయం అందిస్తారు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అనుకూల పరిస్థితులున్నాయి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆశించిన పదవులు దక్కపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మంగళ, బుధ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యల కలయిక వీలుపడదు. విదేశీ విద్యాయత్నం నిదానంగా ఫలిస్తుంది. నిర్మాణాలు పునఃప్రారంభమవుతాయి. స్ధిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు హోదా మార్పు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. లౌక్యంగా వ్యవహరించాలి. పంతాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదలకు అభ్యంతరాలెదురవుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. నిరుద్యోగులకు ఉపాథి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ట్రావెలింగ్ రంరాల పురోభివృద్ధి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పువస్తుంది. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల ఉపాధి శిక్షణ లభిస్తుంది. సంస్ధల స్ధాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆది, సోమ వారాల్లో వ్యక్తుల కలయిక వీలుపడదు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తడి, పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. సహోద్యోగుల సాయం అందుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పనులతో సతమతమవుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. అప్రమత్తంగా వ్యవహరించాలి. హామీలిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. మంగళ, బుధవారాల్లో మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
వివాహ యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహంలో సందడి నెలకొంటుంది. బంధుత్వాలు బలపడతాయి. గురు, శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్త వహించండి. పనులు హడావుడిగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు తప్పవు. విశ్రాంతి అవసరం. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. అవసరాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులకు తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో పాల్గొంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రశాంతంగా ఈ వారం సాగుతుంది. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. ప్రత్యర్థులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా వుంటుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యవహారానుకూలత వుంది. వాగ్ధాటితో రాణిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కనిపించకుండాపోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఈ వారం ధనలాభం, వస్త్ర ప్రాప్తి వున్నాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు జాగ్రత్త. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి.  పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. గృహమార్పు చికాకుపరుస్తుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి అవస్థ పడుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. శని, ఆదివారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. పనులు వేగవంతమవుతాయి. వివాయయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, విశ్రాంతి లోపం, నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు