అమ్మో అంత ధైర్యం లేదు.. బిగ్ బాస్‌ షోకు అందుకే వెళ్లలేదు.. అనసూయ

శనివారం, 10 ఆగస్టు 2019 (11:52 IST)
యాంకర్ అనసూయ బిగ్ బాస్ త్రీ ఆఫర్‌ను వదిలేసుకుందట. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడుతూ ఉండగా, ''బిగ్ బాస్'' ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె స్పందిస్తూ .. ''బిగ్ బాస్'' షోను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో వున్న వాళ్లంతా తనకు బాగా పరిచయమున్న వాళ్లేనని చెప్పింది. బిగ్ బాస్ నుంచి తనకు కూడా ఆఫర్ వచ్చింది. 
 
కానీ సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించింది. ఎందుకంటే.. తాను ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కువ రోజులు వుండలేనని తెలిపింది. ఫ్యామిలీని వదులుకుని అన్ని రోజులు దూరంగా వుండేందుకు ఎంతో ధైర్యం కావాలి. అంత ధైర్యాన్ని తాను చేయలేను. షూటింగుకి బయటికి వెళితేనే రెండు మూడు సార్లు వీడియో కాల్ చేస్తాను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే ఆ అవకాశం ఉండదు. అందుకే వాళ్లు అడిగినా వెళ్లలేదని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు