Leo Zodiac Sign Horoscope: సింహ రాశి 2025 ఫలితాలు.. శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే?

రామన్

బుధవారం, 11 డిశెంబరు 2024 (19:26 IST)
Leo
సింహ రాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
 
ఆదాయం 11
వ్యయం : 11
రాజపూజ్యం : 3
అవమానం 6
 
ఈ రాశివారికి ఈ ఏడాది మొత్తం యోగదాయకంగా ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, ఉన్నత పదవులు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. రుణ సమస్యలు తొలగుతాయి. స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. 
 
బంధుత్వాలు, పరిచయాలు మరింత బలపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. అవతలివారి స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. అనాలోచితంగా నిశ్చితార్ధాలు చేసుకోవద్దు. నూతన దంపతులకు సంతానయోగం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. 
 
మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. తరుచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా అనునయంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. 
 
మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు చేపడతారు. చిరువ్యాపారులు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రతతో శ్రమిస్తే మరింత మంచి ర్యాంకులు సాధించగలరు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. సాహసకార్యాలకు దిగవద్దు. 
 
ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. తీర్థయాత్రలు, విదేశాలు సందర్శిస్తారు. సూర్యభగవానుని ఆరాధన, శనీశ్వరునికి తైలాభిషేకాలు మంచి ఫలితాలిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు