అలాగే దగ్గు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వరం తదితర ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా నయమవుతాయి. శరీరంలో నొప్పులు ఉన్న ప్రదేశంలో నీలగిరి తైలం రాసి ఆయా భాగాల్లో వేడి నీటి కాపడం పెట్టాలి. దీంతో నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. గోరు వెచ్చని నీరు కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నీలగిరి తైలం వేసి బాగా కలిపి దాంతో నోరు పుక్కిలించాలి. రోజూ ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.
ఇకపోతే.. దుస్తులు ఉతికేటప్పుడు కొద్దిగా నీలగిరి తైలం వేసి వాటిని ఉతకాలి. దీంతో దుస్తులకు పట్టి ఉండే ఫంగస్, ఇతర క్రిములు నశిస్తాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్‌షీట్లు, దిండు కవర్లు తదితర ఇతర వస్త్రాలపై కూడా నీలగిరి తైలం చల్లుతుంటే అవి సువాసన వస్తాయి. అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.