తేజ సజ్జా ఇంకా చిన్న పిల్లాడే - మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మిరాయ్ దర్శకుడు

దేవీ

సోమవారం, 15 సెప్టెంబరు 2025 (15:57 IST)
Kartik, Bobby, chiru
తెలుగులో ప్రముఖుల సినిమాలు విడుదలయిన వెంటనే సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తుంటారు. మిరాయి విడుదలకు ముందే ట్రైలర్ చూసి తేజ సజ్జాకు ప్రశంసలు దక్కాయి. లోగడ ఇంద్రలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన తేజ సజ్జా ఇంకా పిల్లాడుగానే అనిపిస్తున్నాడనంటూ సరదాగా మెగాస్టార్ వ్యాఖ్యానించారు. ఆయన అన్నదానిలో అర్థంలేకపోలేదు. మిరాయి లో కూడా తేజ గురించి ఓ డైలాగ్ వుంటుంది. 9వ గ్రంథం కోసం వెతికే క్రమంలో జగపతిబాబు దగ్గరకు వచ్చినప్పుడు హడావుడిచేస్తే ఇంకా చిన్న పిల్లాడి చేష్టలు పోలేదా.. అంటూ డైలాగ్ కూడా దర్శకుడు పెట్టాడు.
 
ఇదిలా వుండగా, మిరాయ్ సినిమాకు వస్తున్న స్పందన మామూలుగా లేదు. అందులో దర్శకుడి ప్రతిభతోపాటు సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కూడా హైలైట్. అదే సినిమాకు మరింత ప్రాణం పోసింది. ఇక మిగిలించి టెక్నాలజీ. దానిని నిర్మాత విశ్వప్రసాద్ తన సొంత టీమ్ తోనే చేయించుకున్నారు. ఇక, మిరాయి సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇచ్చారు.
 
తాజాగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. దానికి అంతకుముందు ఓ సినిమాటోగ్రాఫర్ ను అనుకున్నారు. కానీ మిరాయ్ తర్వాత కార్తీక్ ఘట్టమనేనిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కార్తికేయ 2, ధమాకా వంటి హిట్ చిత్రాలకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. సో.. ఒక సక్సెస్ కెరీర్ ను మార్చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు