రావి చెట్టు బెరడును బూడిద రూపంలో తీసుకుంటే?

శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:27 IST)
రావి చెక్కను నీటిలో ఉడికించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రావి పండ్లను ఎండబెట్టుకుని పొడి చేసి అందులో కొద్దిగా తేనెను లేదా వేడినీళ్లలో కలుపుకుని సేవిస్తే ఉబ్బసం వంటి సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు బెరడును కాల్చుకుని దానిలో నుండి వచ్చే బూడిదను నీటిలో కలుపుకుని వడగట్టి తీసుకుంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు తగ్గుతాయి.
 
ఈ ద్రావణంలో పాలు, చక్కెర కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే మహిళలలో వచ్చే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. లేత రావి ఆకులను మెత్తగా నూరుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త విరేచనాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు