చెరకురసంలో కొంచెం అల్లం రసం కలిపి తాగితే..?

సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (09:51 IST)
కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వలన అజీర్తి కలుగుతుంది. అటువంటపుడు దానికి విరుగుడుగా కొన్ని పదార్థాలను తినడం వలన దోషం నివారిస్తుంది. రాత్రులు చపాతీలు ఎక్కువగా తినడం వలన కలిగే అజీర్తికి దోసకాయ కూర తింటే అజీర్తి కలగదు. కాకరకాయ కూర ఎక్కువగా తినడం వలన కలిగే అజీర్తికి కొంచెం నిమ్మరసం తీసుకుంటే సరిపోతుంది. 
 
బాదం పప్పు అతిగా తింటే అజీర్తికి ఒక లవంగం తింటే సరిపోతుంది. పాయసాన్ని ఎక్కువగా తింటే జీర్ణశక్తి మందగిస్తుంది. పెసరకట్టు తింటే దోషం తగ్గిపోతుంది. అరటి పండ్లు ఎక్కువగా తిన్నా కూడా అజీర్తి కలుగుతుంది. నేతిలో కొంచెం పంచదార కలుపుకుని తింటే అజీర్తి తగ్గుతుంది. మినపప్పుతో తయారుచేసిన గారెలు, సున్నుండలు ఎక్కవగా తింటే కలిగే అజీర్తికి మజ్జిక తాగితే మంచిది. 
 
శెనగలు, శెనగ వంటకాలు ఎక్కువగా తిన్నప్పుడు కలిగే అజీర్తికి కొంచెం ముల్లంగి రసం తాగితే అజీర్తి తగ్గుతుంది. కందకూరగానీ, పులుసుగానీ ఎక్కువగా తింటే అజీర్తికి కొద్దిగా బెల్లం తింటే తగ్గిపోతుంది. చెరకురసంలో కొంచెం అల్లం రసం కూడా కలుపుకుని తాగితే హానివుండదు. కొబ్బరి ఎక్కువగా తినడం వలన అజీర్తి కలుగుతుంది. అటువంటి సమయంలో కొద్దిగా మరమరాలు తింటే అజీర్తి తగ్గిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు