జలుబుతో బాధపడుతుంటే గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని గరగరలాడించాలి.
తులసి ఆకులు, పుదీనా ఆకులు, అరచెంచా అల్లం, బెల్లంకలుపుకుని రెండు కప్పుల నీటిలో మరిగించండి. ఈ మిశ్రమాన్ని వడగట్టిన తర్వాత అందులో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని సేవించండి. దీంతో జలుబు మటుమాయమంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
ఆస్త్మాతో బాధపడుతుంటే ఉప్పునీటి పాత్రను దగ్గర ఉంచుకొని పీలుస్తుంటే ఆ లక్షణాలు దూరమవుతాయి. ముక్కు పట్టేసినట్లుండటం కూడా తగ్గుతుంది. సైనస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవాళ్ళు మామూలు ఉప్పుకు బదులుగా బేకింగ్ సోడా కలుపుకోవాలి.
ఆస్త్మాతో బాధపడేవాళ్లు వెల్లుల్లి రేకలు వేసి మరిగించిన పాలు తాగుతుంటే వ్యాధి బాధించదు. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు పాలలో మరిగేటప్పుడే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రేకలను వేసుకుని తాగాలి.