Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

సెల్వి

గురువారం, 23 అక్టోబరు 2025 (18:47 IST)
Upasana
ఉపాసన కామినేని కొణిదెల, రామ్ చరణ్‌లకు కవలలు పుట్టబోతున్నారని తెలిసింది. ఈ జంట త్వరలో కవలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉపాసన బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెర్రీ దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని ఈ శుభవార్తను షేర్ చేశారు. రామ్ చరణ్- ఉపాసన ట్విన్ బేబీస్ రాబోతున్నారు అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళి కచ్చితంగా డబుల్ ధమాకాగా వచ్చింది. 
 
అనిల్, తాను వచ్చే ఏడాది ఉపాసన, చెర్రీ కవలలను స్వాగతించేందుకు సిద్ధంగా వున్నామని తెలిపారు. ఇకపోతే.. మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Ram Charan and Upasana expecting their Second Child ????????

May the grace of Prabhu Shri Ram protect and bless Ram Charan and Upasana with a life full of love and divine light. ???? #RamCharan pic.twitter.com/344xvSFjCW

— Hinduism_and_Science (@Hinduism_sci) October 23, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు