Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

చిత్రాసేన్

గురువారం, 23 అక్టోబరు 2025 (15:42 IST)
Sidhu Jonnalagadda, Bandla Ganesh, TG Vishwa Prasad, Neerja Kona
సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రాడికల్ బ్లాక్ బస్టర్ తెలుసు కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించారు.  అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ అప్రిషియేషన్ మీట్ నిర్వహించారు.
 
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. జాక్ రిలీజ్ అయిన తర్వాత ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను. వీటన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ ఫీలింగు తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీలయ్యాను. ఒక మనశ్శాంతిని ఫీలయ్యాను. ఈ సినిమా నన్ను ప్రశాంతంగా పడుకునేలా చేసింది. దీనికి అందరికంటే ముందుగా డైరెక్టర్ నీరజ కోన కి థాంక్స్ చెప్పాలి. నితిన్ అన్నకి థాంక్స్ చెప్పాలి. ఈ కథకు నేనైతేనే కరెక్ట్ గా ఉంటుందని నాకు కనెక్ట్ చేశారు. నీరజ్ నేను అనుకున్న ఆలోచనలు తను చాలా గొప్పగా తీసుకుని ఈ కథలో ఇంప్లిమెంట్ చేసుకున్నందుకు తనకు థాంక్స్ చెప్పాలి. ఈ సినిమానే అందరు రాడికల్ అనుకుంటున్నారు. కానీ తన నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ చూస్తే మామూలుగా ఉండదు. 
 
మా విజన్ సపోర్ట్ చేసిన నిర్మాత విశ్వ గారికి థాంక్యూ. తమన్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఆల్బమ్ నా కెరీర్లో ఎప్పటికీ మిగిలిపోతుంది. నవీన్ నూలి సినిమాని అద్భుతంగా ఎడిట్ చేశారు. అవినాష్ గారు అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ చేశారు.  హర్ష శ్రీనిధి రాశి ఈ ముగ్గురు కూడా స్పెషల్ థాంక్స్. అద్భుతంగా పెర్ఫార్ చేశారు. ఇది పక్కా  మాస్ సినిమా. థియేటర్స్ కి వెళ్లి చూడండి. ఈ సినిమా మీకు నచ్చుతుంది. మీకు గుర్తుండిపోతుంది. కొన్ని సంవత్సరాలు పాటు మీతో ఉండిపోతుంది. ఈ సినిమాని చూసి అప్రిషియేట్ చేసిన అందరికీ థాంక్యూ.
 
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అందరు కంటెంట్ ని చాలా డీటెయిల్ గా అనలైజ్ చేశారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి యూనిక్ పాయింట్ మీద కొత్త డైరెక్టర్ కి సిద్దు అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. మేము ఒక యూనిక్ స్టోరీని చెప్పాము.  చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాని తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను.  
 
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ... సిద్దు రవితేజ కి ఆల్టర్నేట్. సిద్దు తేజ మరో రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఎలడానికి పుట్టిన స్టార్. నేనైతే నిర్మాతగా ఇలాంటి సినిమా చేయలేను. ఇలాంటి సినిమా చేయడానికి దమ్ము కావాలి. విశ్వ ప్రసాద్ గారికి హాట్సాఫ్. నీరజ చెల్లి లాంటిది. నేను తీసిన బాషా సినిమాతో తను కాస్ట్యూమ్ డిజైనర్ గా పరిచయం అయింది. తనకున్న ఫ్యాషన్ అద్భుతం. తనని చూసి చాలా గర్వపడుతున్నాను. సిద్దు వండర్ఫుల్ యాక్టర్. తనకి అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూడండి. ఇలాంటి సినిమాని అందరు సూపర్ హిట్ చేయాలి. విశ్వ గారు కథను నమ్మి సినిమా తీస్తున్నారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. ఇంత సూపర్ హిట్ టీం లో భాగమైన అందరికీ అభినందనలు.
 
రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ.. తెలుసు కదా రాడికల్ బ్లాక్బస్టర్ ఇది. 100% యాప్ తో క్యాప్షన్. చాలామంది రాడికల్ మైండ్స్ రాడికల్ థాట్ తో తీసిన సినిమానే తెలుసు కదా. దీన్ని అప్రిషియేట్ చేయడానికి కూడా ఒక రాడికల్ మైండ్ కావాలి. అది థియేటర్లో చూసిన తర్వాత నాకు అర్థమైంది. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమా ఇది. సిద్దు నాకు ఎల్బీడబ్ల్యు సినిమా నుంచి తెలుసు. ఆ సినిమా నాకు చాలా నచ్చింది. టిల్లు లాంటి ఇమేజ్ నుంచి బయటికి రావడం మామూలు విషయం కాదు. వరుణ్ డీజీ టిల్లుని మర్చిపోయేలా చేశాడు. మా సిస్టర్ నీరజ ఇంత కాంప్లికేట్ కథని తీసుకుని ఎంత బ్యూటిఫుల్ గా చేస్తుందని చూసేంత వరకు నేను నమ్మలేదు. సినిమా చాలా అందంగా ఉంది. విశ్వప్రసాద్ గారి లాంటి ప్రొడ్యూసర్ దొరకడం ఇండస్ట్రీకి వరం. ఆయన లాంటి ప్రొడ్యూసర్ ని మనం కాపాడుకోవాలి. ఇది వెరీ బోల్డ్ అండ్ రాడికల్ ఫిలిం .తప్పకుండా ఇలాంటి సినిమాలు అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు