Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

చిత్రాసేన్

గురువారం, 23 అక్టోబరు 2025 (16:53 IST)
Mega Star Chiranjeevi, Vikram Reddy
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర షూటింగ్ ను పూర్తి చేసి, దాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఫాంటసీ నేపథ్యంలో సత్యలోకం కాన్సెప్ట్ తో రూపొందుతోంది. దానికోసం టెక్నికల్ గా అన్ని హంగులు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ సినిమా  ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా క్లారిటీ లేదు. కానీ, చిరంజీవి తర్వాత నటిస్తున్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సంక్రాంతికి విడుదలకు సిద్ధమని చెప్పేశారు.
 
అయితే, విశ్వంభర సినిమా చిత్రంలోని సి.జి. వర్క్ రీత్యా చాలా ఆలస్యమవుతుందని తెలుస్తోంది. అయితే తాజాగా నిర్మాత విక్రమ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదలచేశారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుందని తెలియజేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల  ఓ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ ను రెడీ చేసి, ఆయ‌న‌కు వినిపించగా, చిరంజీవి కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని తెలుస్తోంది. వాస్త‌వానికి వీరిద్ద‌రి కాంబోలో సినిమా ఇప్ప‌టికే రావాల్సింది కానీ ఫైన‌ల్ స్క్రిప్ట్ ద‌గ్గ‌ర సినిమా ఆగింది. ఇప్పుడు ఈ సినిమాకు చిరూ ఓకే అన్నార‌ని వార్త‌లొస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెల్ల‌డ‌య్యే ఛాన్సుంద‌ని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు