లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని పెంచే అరటి.. లైంగిక శక్తి పెరగాలంటే?

మంగళవారం, 6 జూన్ 2017 (14:18 IST)
అరటి పండులోని పొటాషియం, బి విటమిన్ లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. అందుకే అరటి పండును తీసుకోవడం ద్వారా పురుషుల లైంగిక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అరటిలో పొటాషియం మెదడు పనితీరును పెంచుతుంది. మానసిక ఆందోళనలను దూరం చేస్తుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. 
 
అరటిలో వుండే పొటాషియం రక్తపోటును.. హృద్రోగ వ్యాధులను నియంత్రిస్తుంది. ఇందులో రసాయనాలు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అరటిలోని విటమిన్ బి6 ద్వారా లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. అరటిలో పచ్చరంగు అరటి పండును తీసుకుంటే అల్సర్ దరిచేరదు. ఇంకా అరటి పండును పాలతో కలిపి తీసుకుంటేనూ లేకుంటే తేనెతో కలిపి తీసుకుంటేనూ ఉదర సంబంధిత రోగాలను నయం చేస్తుంది.  
 
రక్తంలోని చక్కెరను నియంత్రించి, హిమోగ్లోబిన్ శాతాన్ని అరటి పెంచుతుంది. రోజూ అరటిని తీసుకోవడం ద్వారా పక్షవాతం 40 శాతం మేర తగ్గిపోతుంది.అరటిలో నేచురల్ షుగర్ వుండటంతో పాటు సక్రోస్, ఫ్రుక్టోస్, గ్లూకోజ్‌, ఫైబర్‌లు పుష్కలంగా ఉండటం ద్వారా రోజు రెండు అరటి పండ్లను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు

వెబ్దునియా పై చదవండి