రాత్రిపూట పెరుగు, ఆకుకూర తీసుకోకూడదా.. ఎందుకు..? కరివేపాకుతో తలనొప్పి మటాష్!

శుక్రవారం, 1 జులై 2016 (16:25 IST)
ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు, జీలకర్ర, మెంతులతో తలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఆహారంలో మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. అలాగే ఒన్‌సైడ్ తలనొప్పిని భరించడం చాలాకష్టం. దీనితో తల తిరగడం, వాంతులు కావడం ఏర్పడతాయి.
 
తలనొప్పి ఏర్పడటానికి ఇంకా ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోకపోవడం కూడా ప్రధాన కారణమే. కంటి నిండా నిద్రతో పాటు జీర్ణంకాని ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. రాత్రిపూట ఆకుకూర, పెరుగు వంటివి తీసుకోకూడదు. అజీర్తితో తలనొప్పికి కారణమవుతుంది.
 
మెంతులతో తలనొప్పికి ఉపశమనం ఎలా లభిస్తుందంటే..? వేపిన మెంతులు పొడిని అర స్పూన్ తీసుకుని అందులో అర గ్లాస్ నీటిని పోసి బాగా తెల్లనివ్వాలి. బాగా మరిగాక ఒక స్పూన్ చేర్చి తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు తీసుకుంటే ఒన్ సైడ్ హెడేక్‌ నయం అవుతుంది. మెంతుల్లోని పీచు, ఐరన్ తలనొప్పికి కారణమయ్యే రుగ్మతలను దూరం చేస్తుంది.
 
ఇక జీలకర్ర, ఎండిన ఉసిరికాయను బాగా నీటిలో తెల్లనిచ్చి తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కరివేపాకు కూడా తలనొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కరివేపాకు పొడి, ఖర్జూరం, తేనె మూడింటిని పేస్టులా చేసుకుని రోజూ ఒక స్పూన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి