ధనియాలను మసాలలా కోసం ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తాయి. నోట్లో పొక్కులు ఏర్పడినప్పుడు ధనియాల రసాన్ని నోట్లో వేసుకున పుక్కిలించేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ధనియాలు జీర్ణవ్యవస్థను మంచిగా ఉపయోగపడుతాయి. కళ్ళలో వాపు, నొప్పి, మంటగా ఉన్నప్పుడు ధనియాల పొడిని నీటిలో ఉడికించుకుని వడగట్టాలి.
ఈ ధనియాల నీటిని కళ్ళల్లో డ్రాప్స్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి వాపు, నొప్పి, మంటలు తగ్గుతాయి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. కుదరకపోతే ఈ చిట్కా పాటించకూడదు. ముక్కు నుండి రక్తం రాకుతుంటే కొత్తిమీర రసాన్ని ముక్కులో వేసుకోవాలి. ఇలా చేస్తే రక్తం రావడం తగ్గుతుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తొలగిపోవాలంటే ధనియాల పొడిని కలకండతో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.