అందుకు శరీరాన్ని శుద్ధి చేసే శోధన చికిత్సలు చేయాలి. దీనికి ఐదు రకాల ప్రక్రియలతో వుండే పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గం. అవసరాన్ని బట్టి పంచకర్మల్లోని ఐదు చికిత్సల్లో ఏదో ఒకటిగానీ, అన్నీగానీ చేయాలి. వీటికితోడు జల మర్దనం, స్నేహనం అంటే శరీరానికి నూనె పట్టించడం, స్వేదనం అంటే ఆవిరి స్నానం కూడా అవసరమే.
అలాగే ప్రత్యేకమైన కొన్ని రకాల ఆహార పదార్థాలతో శరీరంలో మూతపడిన శ్రోతస్సులన్నీ తెరుచుకుంటాయి. దాంతో శరీరము, మనస్సూ కొత్త శక్తిని, కొత్త చైతన్యాన్ని పుంజుకుంటాయి. అందువల్ల పైన తెలిపిన పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వుండాలి.