క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తలెత్తవు. మహిళలు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ దూరమవుతుంది. క్యారెట్లలో వుండే విటమిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.
అలాగే ఆరోగ్యంగా వుండాలంటే..
దాల్చిన చెక్క పొడిని డైట్‌లో చేర్చుకోండి.ఇది తీసుకుంటే బ్యాక్టీరియాను నశిస్తుంది. ఇందులో పుష్కలంగా యాంటీయాక్సిడెంట్లు వుంటాయి. అలాగే కొబ్బరినీరు తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌ను పెంచి చురుకుగా వుండేలా చేస్తుంది. వేరుశెనగలు తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.