పొన్నగంటి కూరతో కంటి చూపు పొందండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను, వీర్యకణాల్లోని లోపాలను సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట. కంటికలకలకు, నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. వైరల్, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది.