జీలకర్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటల్లో ఖచ్చితంగా వాడేది. ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, సోడియం, పొటాషియం, విటనమి ఏ, సి వంటి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్య నిపుణులు జీలకర్రను నిత్యం వంటల్లో విధిగా వాడాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఫైల్స్ ఉన్నవాళ్లు చిటికెడు జీలకర్ర రోజూ నమిలితే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వారు చెబుతున్నారు. అంతేనా, జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ తయారుకావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అలాంటి జీలకర్ర ఉపయోగాలను ఓసారి తెలుసుకుందాం.
* ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వల్ల జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
* జీలకర్ర కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
* రోజువారీ ఆహారంలో జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఫలితంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.