మనం రోజూ తినే పోషక పదార్థాలలో ఉప్పు కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఉప్పు సరిపడినంత తీసుకుంటే శరీరానికి మంచిదే కానీ దాని మోతాదు ఎక్కువైతే మాత్రం అనారోగ్యం బారినపడక తప్పదు. అయితే, ఉప్పు కలిపిన నీటిని ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అవేంటో ఇపుడు చూద్ధాం.
ఉప్పునీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఉప్పు నీరు ఎంతగానో దోహదం చేస్తుంది. ఉప్పు నీటిని రోజూ తాగడం వలన నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఈ నీరు శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉండి సులభంగా నిద్ర వస్తుంది.
ఉప్పునీటిలో ఉండే సల్ఫర్, క్రోమియం వంటి పదార్థాలు చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తాయి. అలాగే, చర్మాన్ని నీటిగా పరిశుభ్రంగా ఉంచుతుంది. బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా బరువు తగ్గాలంటే రోజూ ఉప్పునీటిని తాగడం వల్ల ఫలితం ఉంటుంది. అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలోనూ, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలను తొలగించడంలోనూ ఉప్పునీరు బాగా పనిచేస్తుంది.