గంటల గంటలు టీవీల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? అయితే మొలల వ్యాధి తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిబారిన పడకుండా ఉండాలంటే.. రోజూ వ్యాయామం చేయాలి. రక్తప్రసరణను మెరుగుపరుచుకోవాలి. అంతేగాకుండా ఆహారంలో చేమదుంపల కూరను ఆహారంలో చేర్చుకోవాలి.
చేమదుంపల ఆకుల్లో విటమిన్ ఎ, సి, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తద్వారా చేమదుంపలు లేదా ఆకుకూరను వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే మొలల వ్యాధిని తరిమికొట్టవచ్చు. ఇంకా మోకాళ్ల నొప్పి నయం చేసుకోవచ్చు. ఇక మందార రేకులు మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వాత, పిత్త వ్యాధులను దరిచేరనివ్వదు.
అలాంటి మందార పూవుల రేకులతో నరాలకు బలం చేకూర్చే, మొలల వ్యాధిని దూరం చేసే షర్బత్‌ను ఎలా చేయాలో చూద్దాం. ఓ పాత్రలో రెండు గ్లాసుల నీటిని పోసి.. అందులో మందాల పూవు రేకులు పదింటిని వేసి మరిగించాలి. ఆపై అరగ్లాసు నిమ్మరసాన్ని అందులో చేర్చాలి. రుచికి తగినట్లు బెల్లాన్ని కలుపుకుని.. కాసేపు మరిగించి.. ఆపై సర్వింగ్ గ్లాసులో వడగట్టి తీసుకుంటే మొలల వ్యాధి నయం అవుతుంది.
ఈ షర్బత్‌ను వేసవిలో తీసుకుంటే.. శరీర వేడి తగ్గుతుంది. పేగు సంబంధిత రుగ్మతలు దూరమవుతాయి. ఇందులో నిమ్మరసాన్ని చేర్చడం ద్వారా టాక్సిన్లు తొలగిపోతాయి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే చేమదుంపల ఆకులను సన్నగా తరిగి వాటిని సూప్‌లా తయారు చేసి వారానికి రెండు సార్లు తీసుకుంటే.. మొల వ్యాధులను పూర్తిగా దూరం చేసుకోవచ్చు.
చేమదుంపల ఆకులతో సూప్ ఎలా చేయాలంటే?.. స్టౌ మీద బాణలి పెట్టి.. చేమదుంపల ఆకులు, కాసింత చింతపండు రసం, నువ్వుల నూనె, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చిటికెడు మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఇంగువ చేర్చి బాగా వేపాలి. బాగా వేగాక ఈ మిశ్రమానికి కాసింత నీటిని చేర్చి మరగించాలి. పది నిమిషాల తర్వాత ఈ సూప్‌లో కాసింత నెయ్యిని చేర్చి తీసుకుంటే మొల వ్యాధులు దరిచేరవు. శరీరానికి బలం చేకూరుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలుండవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.