ఆకలేసినప్పుడు ఏదైనా ఓ పండు తీసుకోండి

FILE
డైటింగ్ కోసం పరిమాణం కాదు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు చేసుకోండి. అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువ తినడం కన్నా ఆరోగ్యకమైనది, పరిశుభ్రమైనది, రుచికరమైనది మితంగా తీసుకున్నా చాలు. అందుకని ఫాస్ట్‌ఫుడ్‌ను కట్టి పెట్టండి. నిపుణుల సలహాతో సింపుల్‌గా, రుచికరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించండి .

ఖరీదు ఎక్కువైనా కూడా నాన్‌స్టిక్‌ పాన్స్‌ను కొనండి. నూనె వాడకం బాగా తగ్గుతుంది. మార్కెట్లో దొరికే పలురకాల ఆహారపద్ధార్దాల ప్యాక్‌లపై 'తక్కువ కెలోరీలు' అని రాసి ఉంటాయి. దాన్ని చూసి మోసపోకండి. కెలోరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి.

వంటచేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వంటకాల్లో వేసే నూనెను తగ్గించడం, అధిక కొవ్వు ఉండే వెన్న, నెయ్యిని మితంగా వాడడం అలవాటు చేసుకోండి.

అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు రెండు బిస్కెట్లు, పెద్ద కప్పు చిప్స్ తినేస్తుంటారు చాలామంది. వీటికి ప్రత్యామ్నాయాలు ఎంచుకోండి. ఆకలేసినప్పుడు ఏదైనా ఓ పండు లేకపోతే తాజా కూరగాయలు తినడం ప్రారంభించండి.

ఫిట్‌నెస్ బంతి ఒకటి కొనిపెట్టుకోండి. టీవీ చూస్తున్నా లేక ఏదైనా పుస్తకం చదువుతున్నా కూడా దానిపై కూర్చొనేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. లేదంటే సాధ్యమైనంతవరకు నడవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

వెబ్దునియా పై చదవండి