డైటింగ్ పేరుతో పూర్తిగా భోజనం తగ్గించేస్తున్నారా..?

FILE
ఒకేసారి డైటింగ్ చేసి అంటే పూర్తిగా భోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు తగ్గాలనుకుంటారు చాలా మంది, ఇది పొరబాటు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. చర్మం మెరుపు కోల్పోతుంది.

వ్యార్ధకపు చయలు కనిపిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ ఆహారంలో క్యాల్షియం, ఇనుము, విటమిన్ - ఎ,ఇ,సి,బి కాంప్లెక్స్‌లు వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బరువు తగ్గగలుగుతారు.

సమతులాహారం, వ్యాయామం, జీవనవిధానం... వీటన్నింటిని పాటిస్తే బరువు తగ్గడం సులభం. కొవ్వు తీసేసిన పాలు సేవించడం, ఎముకలు బలంగా ఉండటానికి - మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు ఆహారంలో చేర్చుకోవడం వంటివి చేయాలి.

మాంసకృత్తుల కోసం - కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్‌, వేరుశనగలు. హోల్‌ వీట్‌, జొన్నలు, తెల్ల ఓట్స్‌, రాగిమాల్ట్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి