నల్లని చాక్లెట్ తినండి.. మనస్సును ప్రశాంతంగా వుంచుకోండి

FILE
నల్లని చాక్లెట్ తినండి.. మనస్సును ప్రశాంతంగా వుంచుకోండి అంటున్నారు పరిశోధకులు. నల్లగా ఉండే చాక్లెట్‌ నోటికి తీయదనంతో పాటూ.. మనసుకు ప్రశాంతత కూడా కలిగిస్తుందని... తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి నల్లని చాక్లెట్‌ ఉపకరిస్తుందిట.

అందులో ఉండే పాలిఫెనాల్స్‌ అనే రసాయనం ప్రశాంతతను, తృప్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కల్లో ఉండే పాలి ఫెనాల్స్‌ మన ఆహారంలో సహజసిద్ధంగా ఉంటుంది.

ఈ రసాయనలు ఆక్సిడేటివ్‌గా పనిచేసి ఒత్తిడి తగ్గిస్తాయట. మానసికంగా అనేక దుష్ప్రభావాల్ని ఇవి దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సో డార్క్ చాక్లెట్లను రోజుకు రెండు ముక్కలు తీసుకోండి.

వెబ్దునియా పై చదవండి