మహిళలు చిరాగ్గా ఉండాడానికి కారణం ఏమిటా? అనే దానిపై నిర్వహించిన అధ్యయనంలో వేళకు సరిగ్గా భోజనం చేయకపోవడమే కారణమని తేలింది. మెల్బోర్న్కు చెందిన మానసిక నిపుణుల బృందం ఉదయం పూట మహిళలు చిరాగ్గా ఉండడానికి కారణం ఏమిటా? అని దీనిపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించింది.
ఈ అధ్యయనంలో వేలమంది ఉద్యోగినులు, గృహిణులను పరిగణనలోకి తీసుకుని వారి దినచర్యను, జీవనశైలిని, ఆరోగ్య పరిస్థితులను గురించి విచారించారు.
ఈ అధ్యయనంలో తేలిన విషయమేమంటే ఆడవారు బోలెడన్ని బాధ్యతలతో శారీరకంగాను, మానసికంగాను ఎంతో శ్రమ పడతారని, చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారని, దీని ఫలితంగా పొద్దునే చాలా నీరసంగా ఉంటారని గుర్తించారు.
కాబట్టే ఉదయాన్నే కొందరు మహిళలు చిరాకును, కోపాన్ని ప్రదర్శిస్తారట. ఇందుకు పనుల ఒత్తిడితో సరిగ్గా ఆహారం చేయకపోవడమే కారణమని పరిశోధకులు తేల్చారు.