కరివేపాకు అనగానే ఘుమఘుమ వాసన గుబాళిస్తుంది. ఎంత బాగా వండినా, కరివేపాకు వేయని వంటలో ఏదో వెలితి కనిపిస్తుంది. కరివేపాకుని వాడని వారు వుండరు. వంద గ్రాముల కరివేపాకులో ఉండే పోషక విలువలేంటో మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి.
సువాసనతో పాటు, పోషక విలువలు, ఔషధ విలువలు కలిగిన కరివేపాకును వంటలలో వాడటం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందడంతో పాటు మీ జుట్టు దట్టంగా పొడవుగా ఉంటాయి. కరివేపాకు పొడి శీతలాన్ని హరిస్తుంది.