గోరువెచ్చని నీటిలో లవంగాలను వేసుకుని తీసుకుంటే?

మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (13:06 IST)
Clove Water
వేసవిలో రోజుకు ఒకటి నుండి రెండు లీటర్ల నీరు త్రాగడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం పూట కలబంద లేదా ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా పడుకునే ముందు గోరువెచ్చని నీటితో లవంగాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 
 
ఇందులో విటమిన్ సి, ఫోలేట్ రిబోఫ్లావిన్, విటమిన్ ఎ, థయామిన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఇతర యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.  
 
నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో లవంగాలను తీసుకుంటే ఉదర రుగ్మతలు నుంచి బయటపడవచ్చు. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. 
 
ఇది మొటిమలను నివారించడంలో సహాయపడే ఒక రకమైన సాలిసైలేట్‌ను కలిగి ఉంటుంది. గోరువెచ్చని నీటితో లవంగాలను తీసుకోవడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు