జొన్నల్లోని మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, జింక్ వంటివి మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే జొన్నపిండితో చేసే జొన్న రొట్టెలు తినటం వల్ల బరువు పెరగకుండా వుంటారు. జొన్నల్లోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్న రొట్టెలు సాయం చేస్తాయి.