ఆకాకర కాయలు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయి.
ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి.
ఆకాకరలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.
ఆకాకరకాయను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.