కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజలవణాలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలతో కూడిన సమతుల ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకు పునాది గర్భస్థ శిశుదశలోనే పడాలి.
అందుకే గర్భిణులు ఇతర పోషకాలతో పాటు డి.హ్‌చ్.ఎ. (డొకొసా హెక్సానిక్ యాసిడ్) అనే ఫ్యాటీయాసిడ్ పుష్కలంగా అందేలా చూసుకోవాలి. అంతేకాదు ఏడాది దాటిన పిల్లలకు కూడా ఈ ఫ్యాటీయాసిడ్ సమృద్ధిగా అందివ్వాలి.
కోడిగుడ్లు, బాదం లాంటి ఎండు గింజల్లోని పప్పులు, సోయా, అవిస గింజలు, చేపలు, చేప నూనెలు, వెజిటబుల్ నూనెలు తదితరాల ద్వారా ఈ ఫ్యాటియాసిడ్ విరివిగా లభిస్తుంది.