నెలసరి నిలిచిన మహిళలు టమోటాలు తీసుకుంటే?

శుక్రవారం, 20 డిశెంబరు 2013 (17:01 IST)
FILE
నెలసరి నిలిచిన మహిళలు టమోటాలు ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు తెలిపారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో టమోటాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తేలింది.

నెలసరి నిలవడంతో మహిళల్లో శరీర బరువుతో పాటు ఎత్తుల నిష్పత్తి పెరుగుతుంది. తద్వారా వారికి రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి వారు టమోటాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కొవ్వు, చక్కెర జీవక్రియలను నియంత్రించడంలో పాలుపంచుకునే అడిపోనెక్టిన్ హార్మోన్ స్థాయిలు తొమ్మిది శాతం పెరిగినట్లు రట్‌గర్స్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.

అలాగే నెలసరి నిలిచిన మహిళలు అత్యవసర పోషకాలు, విటమిన్లు, ఖనిజాలుంటాయని, ఇంకా ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభించే కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా బోలెడు లాభాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ దరిచేరకుండా ఉండాలంటే.. రోజూ పండ్లు, కూరగాయలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి