బిడ్డతల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. బిడ్డకు పాలు పడాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే.. ముందుగా తల్లికి మంచి శక్తినిచ్చే కేలరీలు అందే ఆహారం తీసుకుంటున్నామా అని తెలుసోకోవాలి. తల్లిపాలు ఇవ్వడం మొదలయ్యే సరికి మహిళలో కేలరీలు గతంలో కంటే బాగా తగ్గుతాయి.
అలాగే ఏ ఆహారం తింటే బేబీకి అనారోగ్యం కలుగుతూంటుందో గమనించి ఆ పదార్ధాలు తినకుండా ఉండటం మంచిది.. బేబీ కనుక పాలు తాగటం మానేస్తే మీరు తినే ఆహారం సరిగా లేదని గుర్తించండి.
ఇక ప్రతిరోజూ ఒక కప్పు కాఫీ లేదా టీ తీసుకోవచ్చు. ఇవి కనుక అధికంగా తాగితే వీటి ప్రభావం బిడ్డ నిద్రమీద పడుతుంది. బేబీ ఆహారం కొరకు మీపై ఆధారం కనుక బేబీ జీర్ణవ్యవస్ధకు హాని కలిగించే మసాలా తిండ్లు తీసుకోకుండా ఉండడం మంచిది.
బిడ్డతల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
1. ఎప్పుడూ తాజా పండ్లు, కూరలు తినాలి. పప్పు దినుసులు, తృణధాన్యాలు తీసుకోవాలి. 2. తీసుకునే ఆహారంలో అధికమైన ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్ వుండేలా చూసుకోవాలి 3. పోషకాలు అధికంగా ఉండే పెరుగు, బ్రెడ్, ఉడికించిన మొలకలు, పనీర్‌తో చేసిన వంటకాలు తీసుకుంటూ వుండాలి.
4. ప్రొటీన్లు అధికంగా వుండాలంటే మాంసం, చేపలు, కోడి మాంసం పెట్టాలి. కోడి గుడ్లు, జున్ను పెరుగు, ఇతర ఆరోగ్యకర పదార్ధాలు ఇవ్వాలి. 5. బరువు పెరగని, కొవ్వు తక్కువగా వుండే పాల ఉత్పత్తులు ఇవ్వాలి. నెయ్యి వాడరాదు.
6. ఐరన్, ప్రొటీన్ అధికంగా ఉడికించిన బీన్స్, పచ్చి బఠానీలు తినాలి. 7. ఫోలేట్ అధికంగా ఆకు కూరలు, గోంగూర, క్యాబేజి, మొలకలు మొదలైనవి తినాలి. 8. పండ్లు, టొమాటోలు, బెర్రీలు, కేప్సికం, బంగాళదుంపలు మొదలైనవి బేబీకి తల్లికి విటమిన్ సి అందిస్తాయి.