మహిళలూ.. బరువు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

FILE
ఫాస్ట్‌ఫుడ్ పుణ్యమా అంటూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఊబకాయం తప్పట్లేదు. మహిళల్లోనూ పురుషుల్లోనూ పొట్ట పెరిగిపోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళలకు ప్రసవానికి తర్వాత పొట్ట పెరిగిపోతోంది. అలా పెరిగిన పొట్టను తగ్గించుకోవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి.

పొట్ట తగ్గాలంటే ఫిజియోథెరపిస్టులు, ఫిట్‌నెస్ శిక్షణాదారుల ఆలోచనలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వారి సలహాల మేరకు వ్యాయామం చేస్తే పొట్ట పెరగడానికి చెక్ పెట్టవచ్చు. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంతో పాటు డైటింగ్ పాటించాలి. పరిమిత వ్యాయామం, ఆహారంతో ఆయుష్షు పెరుగుతుంది.

రోజూ ఐదు కప్పుల కూరగాయలు లేదా పండ్లు తీసుకోవాలి. ఆకుకూరలు, బీన్స్‌తో పాటు పొట్లకాయ, గుమ్మడి వంటి కూరగాయల్ని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. సీజన్ పండ్లను తీసుకుంటూ ఉండాలి. అయితే మామిడి, పనస, దుంపల్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. బొప్పాయి కాయ ముక్కల్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి