మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?

మంగళవారం, 17 మే 2022 (14:49 IST)
ప్రేమ అనే మాట వినగానే హృదయంలో గిలిగింతలు మొదలవుతాయి. ప్రేమలో పడితే ఈ ప్రపంచమంతా మీ గుప్పిట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమ భావనను వ్యక్తీకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మీరు ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు మీ మనస్సులో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు ప్రేమలో పడ్డారా, లేదంటే ఆ భావనంతా మీలో కలిగే కోరికల ప్రభావమా? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. సరే ఇవన్నీ కాదు..ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?

 
ప్రేమ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
రొమాంటిక్‌ లవ్‌లో మూడు ప్రధానమైన అంశాలుంటాయని రాట్‌కర్స్ యూనివర్సిటీ చెందిన హెలెన్ ఇ.ఫిషర్ అన్నారు.

 
మొదటిది కామం.
తరచూ కామం ముందు వరసలో నిలుస్తుందని, అయితే అది అన్ని సందర్భాలలో నిజం కాదని ఫిషర్స్ అన్నారు. శృంగారం మీద ఆసక్తి లేని వారిలో కలిగే ప్రేమ భావనలో కామం ఉండకపోవచ్చన్నారు. కామం అనేది ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ల వంటి హార్మోన్లు చూపించే ప్రభావం. ఇవి మీ లైంగిక సామర్థ్యాన్ని, కోరికను ప్రభావితం చేస్తాయి. ఇది పూర్తిగా భౌతికమైన అంశం. అయితే, ఇది సెక్స్ చేయాలనే కోరికను కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి హార్మోన్లు తండ్రి లేదా తల్లి డీఎన్ఏ నుంచి రావచ్చు. కామం లేకపోతే భూమిపై మానవజాతి ఉనికే ఉండేది కాదని మీరు అంటుంటారు.

 
రొమాంటిక్ లవ్‌లో రెండో కోణం ఆకర్షణ.
ఇది డోపమీన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ ద్వారా ప్రభావితమవుతుంది. ఇది మన మెదడులో విడుదలయ్యే జీవ రసాయనం. ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని మనల్ని ప్రేరేపిస్తుంది. పైగా అదే పనిని పదే పదే చేయాల్సిందిగా కూడా చెబుతుంటుంది. అంటే, మన బిహేవియర్‌ను పునరావృతం చేయాలని ఇది ప్రోత్సహిస్తుందన్నమాట.

 
ప్రేమ అనేది వ్యసనమా?
అపారమైన ఆకర్షణ అనే భావన మనిషిని ప్రేమ పట్ల వ్యసనపరుడిగా మారుస్తుంది. కొంతమంది వ్యక్తులు ఈ వలయంలో కూరుకుపోతారు. డోపమీన్ ప్రేరేపణల కారణంగా కొత్త సంబంధాలు అనే థ్రిల్ కోసం వెతుకులాడుతుంటారు. అంటే వీరు ప్రేమకు బానిసలని అర్థం. ఇదే రొమాంటిక్ లవ్‌కు సంబంధించిన మూడో అంశం.

 
ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిలో తార్కికంగా ఆలోచించే శక్తిని, సరైన ప్రవర్తనను నియంత్రించే మెదడులోని భాగాన్ని డోపమీన్ నిరుత్సాహపరుస్తుంది. ప్రజలు ఇలాంటి అశాస్త్రీయమైన భావనలో కనీసం 18 నెలల వరకు ఉండగలరు. మరొక హార్మోన్ కూడా ఆకర్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని పేరు నోరపినఫ్రిన్. దీని ప్రభావంలో ఉన్నవారికి శరీరంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి ప్రేమలో ఉన్నవారికి తరచూ చెమట పోస్తుంటుంది. గుండె దడ కలుగుతుంది. దీర్ఘ శ్వాసతో పాటు, అరచేయి తడిగా మారుతుంది. ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అదే అనుభూతి. అయితే ఇది మంచి ఒత్తిడి.

 
మరి కామం అంటే ఏంటి?
కామంలో కూడా రెండు హర్మోన్లు ప్రధానంగా పని చేస్తాయి. అవి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్ అనేది కౌగిలింతలకు ప్రేరేపించే హార్మోన్. ఇది సెక్స్ సమయంలో విడుదలై, లైంగిక సంపర్కాన్ని ప్రేరేపిస్తుంది. భద్రత, సంతృప్తి అనే రెండు అనుభూతులను కలిగిస్తుంది. ఇది భాగస్వామితో సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రేరణనిస్తుంది. సెక్స్ తర్వాత వాసోప్రెసిన్ అనే హార్మోన్ విడుదలై సంతృప్తిని కలిగిస్తుంది. అయితే, ఇది సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులను బాధితులుగా మారుస్తుంది.

 
వారి మెదడులోని ఆ సంతృప్తి కలిగించే భాగాన్ని ప్రభావితం చేసి, సెక్స్‌ను ఒక అడ్వాంటేజ్‌గా భావించేలా చేస్తుంది. దీంతో వాళ్లు ఇది మళ్లీ మళ్లీ కావాలని, పొందాలనీ కోరుకుంటారు. ఈ హార్మోన్లతో ఉండే మరొక ప్రభావం ఏంటంటే, నేను ప్రేమలో ఉన్నది ఇతనితోనేనని, అతనితోనే చిరకాలం ఉండాలన్న కోరికను పెంచుతుంది. అన్నీ సవ్యంగా జరిగే, మీ ప్రేమలో స్థిరత్వం, సంతృప్తి ఏర్పడతాయి. మీలో ఉండే దయార్ధ్ర హృదయం ప్రేమలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

 
ప్రేమలో చీకటి కోణం
ప్రేమలో చీకటి కోణాలు కూడా ఉంటాయి. మీ మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్ సెరోటోనిన్ స్థాయి పడిపోవడం పిచ్చి, అసూయ వంటి భావాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రేమ శాశ్వతంగా ఉండదని మనందరికీ తెలుసు.  కొన్నిసార్లు మీ హృదయంలో పుట్టిన ప్రేమ భగ్నమవుతుంది. అది మీకు ఓ గుండెపోటులా అనిపించవచ్చు.

 
ఎందుకంటే బ్రేకప్ వల్ల మనకు కలిగే ఒత్తిడి కొన్ని రసాయనాల కారణంగా నొప్పి లాగా మెదడుకు సంకేతాలు వెళతాయి. అందువల్ల మన మెదడు బ్రేకప్‌ను ఒక నొప్పిగా అర్థం చేసుకుంటుంది. కానీ, బ్రేకప్ అయినప్పటికీ, అసాధారణ ప్రవర్తన, అరచేతులు చెమటతో తడవడంలాంటి దశలోకి ప్రజలు వెళుతూనే ఉంటారు.

 
చాలామంది ప్రేమలో పడతారు. ప్రతిరోజూ ప్రేమలో మునిగిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే డోపమీన్ మనల్ని ముంచెత్తుతూనే ఉంటుంది. మీలో ప్రేమ అనే భావన ఏర్పడ లేదంటే మీ మెదడు మీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తోందని అర్థం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు