నేను ముఖ్యమంత్రిగా కొనసాగవద్దని ఏ ఎమ్మెల్యే అయినా కోరుకుంటున్నట్లయితే.. వర్ష బంగళా(ముఖ్యమంత్రి అధికార నివాసం)లో నా వస్తువులన్నీ సర్దుకుని మాతోశ్రీకి వెళ్లిపోవటానికి నేను సిద్ధం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార శివసేన పార్టీలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
మీరు చెప్తే సీఎం పదవి వదిలిపెట్టటానికి నేను సిద్ధం. ఇది నంబర్ల గురించి కాదు. ఇది నన్ను ఎంతమంది వ్యతిరేకిస్తున్నారనే దాని గురించి. ఒక్క ఎమ్మెల్యే అయినా సరే నన్ను వ్యతిరేకిస్తున్నట్లయితే నేను వెళ్లిపోతా. కనీసం ఒక్క ఎమ్మెల్యే నన్ను వ్యతిరేకించినా కూడా అది నాకు చాలా అవమానరం అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి వస్తుంది, పోతుంది. కానీ నిజమైన సంపద ప్రజల అభిమానం. గడచిన రెండేళ్లలో ప్రజల నుంచి ఎంతో అభిమానం సంపాదించుకోగలగటం నా అదృష్టం అని చెప్పారు.