ఇంకా హెయిర్ డామేజ్కు నెయ్యి బాగా పనిచేస్తుంది. నాలుగు చెంచాల నెయ్యిని తీసుకుని వెంట్రుకల చివర్లో రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెన దువ్వుకోవాలి. ఆపై మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నీళ్లు, నెయ్యిని సమపాళ్లలో తీసుకుని మిక్స్ చేసుకుని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది.
ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా చర్మ ఛాయ పెంపొందుతుంది. అలాగే పాలు, సున్నిపిండి, నెయ్యిని సమపాళ్లలో తీసుకుని పేస్టులా తయారు చేసుకుని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి ఆపై ముఖాన్ని కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.