జిడ్డుకు చెక్ పెట్టే మొక్కజొన్న పిండి.. మేకప్ లేకున్నా మెరుస్తారంతే?

శనివారం, 13 ఆగస్టు 2016 (10:38 IST)
ఏ సీజన్ అయినా చర్మం జిడ్డుగా తయారైతే.. రకరకాల క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ముఖంపై జిడ్డు పేరుకుని మేకప్ వేసుకుంటే.. మళ్లీ నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

పసుపు: దీనిలో యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ రాత్రి పూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి...మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది. 
 
అలాగే స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఈ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
ఇక కార్న్ ఫ్లోర్ కూడా ముఖంపై గల జిడ్డు పోగొడుతుంది. మొక్కజొన్న పిండిలో... నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఈ పూత వేసుకున్నాక మేకప్‌ వేసుకున్నా ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తారు.

వెబ్దునియా పై చదవండి