కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కళ్ళకు రాసుకుంటే?

శనివారం, 28 జనవరి 2017 (13:08 IST)
అర టీ స్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షిణీయంగా ఉంటాయి. కళ్ళకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు విశ్రాంతి లభిస్తుంది. 
 
గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈమిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజా మెరుస్తాయి. కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే ముడతలునుండి విముక్తి పొందవచ్చు. 
 
నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి.పదినిమిషాల తరవాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపు చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి