కొబ్బరి నూనెతో అందం.. ఆరోగ్యం... ఏం చేయాలంటే?

సోమవారం, 1 అక్టోబరు 2018 (15:21 IST)
కంటికి మేకప్ వేసుకునేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో, దానిని శుభ్రం చేసేటప్పుడు కూడా అంతే కష్టంగా ఉంటుంది. కనుక కొబ్బరి నూనెలో దూదిని ముంచి కళ్ళపై గల మేకప్‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
 
పెదాలు పగుళ్ళుగా ఉన్నప్పుడు కొబ్బరినూనెను పెదాలకు రాసుకోవాలి. ఇలా రోజుకు రెండుపూటలా రాసుకోవడం వలన ఈ సమస్య ఇక రాదు. ఒకవేళ కాళ్ళు పగుళ్ళుగా ఉంటే ప్రతిరోజూ ఉదయాన్నే స్నానానికి ముందుగా గోరువెచ్చని నీటిలో కాళ్ళను కాసేపు ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. స్నానానికి ముందుగా కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుని అరగంట తరువాత స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 
 
మెుటిమల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. వాటిని ఎలా తొలగించుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. అందుకు కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెుటిమలు, నల్లటి మచ్చులు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు