తీరైన వక్ష సంపద కోసం ఏం చేయాలంటే...?

శనివారం, 29 జూన్ 2019 (19:09 IST)
చాలామంది మహిళలు తమ వక్షోజ ఆకృతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఇక వక్షోజాలు జారినట్లుగా ఉంటే ఇక వారికి నిద్రపట్టదు. ఇలాంటివారు కొన్ని చిట్కాలను పాటిస్తే వక్షోజాలు బిగుతుగా అందంగా తయారవుతాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.
 
దోసకాయ-గుడ్డు పచ్చసొనతో....
ఓ చిన్న దోసకాయ తీసుకుని దాన్ని బాగా మెత్తగా తురమాలి. దీనికి గుడ్డులోని పచ్చసొనను కలపాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ మిశ్రమానికి ఓ టీ స్పూన్ వెన్న కలపాలి. అలా తయారు చేసిన పేస్టును రెండు వక్షోజాలకు పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత 30 నుంచి 40 నిమిషాలపాటు అలాగే ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. ఇలాంటి మాస్కును వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. 
 
ఆలివ్ ఆయిల్‌తో మర్దన...
ఆలివ్ ఆయిల్ కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. సహజమైన విటమిన్లు ఉంటాయి. ఈ ఆయిల్‌తో వక్షోజాలకు 15 నిమిషాల పాటు మర్దన చేస్తే ఫలితం బాగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు