స్తన సౌందర్యానికి చిన్నచిన్న చిట్కాలు

శనివారం, 4 మే 2019 (15:56 IST)
స్తన సౌందర్యంపై యువతులు ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. ఎద అందంలో తేడా వుందని తోటివారు ఎవరయినా చిన్నమాట అంటే చాలు... ఇక నిద్రలేని రాత్రులేనంటే అతిశయోక్తి కాదు. అందుకే వక్షోజ సౌందర్యంపై చాలామంది యువతులు మథనపడుతుంటారని చెపుతుంటారు బ్యూటీషియన్లు. శరీరంలో ముఖం, శరీర సౌష్టవం అంతా బాగున్నా తగిన వక్షోజ సంపద లేకపోతే వారి బాధ అంతాఇంతా కాదు. అలాంటి వారు ఈ క్రింది సింపుల్ టిప్స్ పాటిస్తే అనుకున్నవిధంగా అందమైన ఎద సౌందర్యం సొంతమవుతుంది.
 
వ్యాయామం: వ్యాయామం ద్వారా వక్షోజాల ఆకృతులు పెరగవు. కానీ పాలిండ్ల లోపల ఉన్న టిష్యూలను బలపరిచి స్టిఫ్‌గా ఉండేందుకు వ్యాయామం ఎంతో సహకరిస్తుంది. దీనివల్ల ఉన్న వక్షోజ సంపద కాస్తంత బిగుతుగా కనిపించడమే కాక ఆకృతిలోనూ తేడా కనబడుతుంది. పుషప్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఈ మార్పును తీసుకురావచ్చు. కాకపోతే దీనికోసం రెండు మూడు నెలలు బాగా శ్రమించాల్సి ఉంటుంది. 
 
హెర్బల్ ప్రొడక్ట్స్: ఇవి కూడా వక్షోజ సంపదను వృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఇవి సహజసిద్ధమైనవే కాక సురక్షితమైనవి కూడా. ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయవు. వక్షోజ ఆకృతులను పెంచుకునేందుకు రకరకాల మాత్రలు, క్రీములు వాడేకంటే ఈ హెర్బల్ ఉత్పత్తులను వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇటువంటి ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. కాకపోతే వీటిని వైద్యుల సిఫార్సు మేరకు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి వృద్ధి చెంది పాలిండ్ల ఆకృతులను పెంచేందుకు సహాయపడతాయి. 
 
ఆహారం: వక్షోజ సంపదను పెంచగల ఆహార పదార్థాలేమిటో తెలుసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. కెఫైన్ సంబంధిత పదార్థాలను తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. ముఖ్యంగా ఎద సౌందర్యాన్ని పెంచుకునేందుకు హెర్బల్ ఉత్పత్తులు ఉపయోగించేవారిలో ఇది వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రోడ్ల స్థానే ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే వక్షోజ సంపద ద్విగుణీకృతమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు