ఈ ఆధునిక ప్రపంచంలో మానవులు తన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. అందువల్ల నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటి రుగ్మతలతో సతమతమవుతున్నారు.
రోజూ 20 నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో గడిపితే ఒత్తడి అంతా దూరమవుతుందట. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ అలబామాకు చెందిన సైంటిస్టులు నిత్యం పార్కులకు వెళ్లే 100 మందిపై అధ్యయనం చేశారు. వారిలో ఏవైనా మానసిక సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు, అలాగే సంతృప్తికరమైన జీవితం వంటి అంశాలపై శాస్త్రవేత్తలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
ఫలితంగా వారికి ఈ విషయం అర్థమైందట. అదే నిత్యం 20 నిమిషాల పాటు పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో గడిపే వారికి ఒత్తిడి అసలు ఉండదట. దీనికి తోడు డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు కూడా పోతాయని వారు చెబుతున్నారు.