ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్‌ని పుష్కలంగా కలిగి ఉండే కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం. పచ్చి బఠానీలు, బీన్స్ వంటి కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పచ్చి బఠానీలను నానబెట్టి ఉడికించుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. బీన్స్‌ను కూరల్లో వేసే కంటే వేపుడు చేసుకుని తింటే వాటిలోని విటమిన్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. క్యారెట్‌లో కూడా శరీరానికి అవసరమైనంత ఫైబర్ లభిస్తుంది.
వంద గ్రాముల క్యారెట్స్‌లో 2.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్యారెట్‌ను పచ్చిగా తింటే మంచిది. అలానే పాలకూర, దీనిలోని విటమిన్ ఏ, బి, సి, కె, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అజీర్తిని తొలగిస్తాయి.
పాలకూరను కూరగా తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు అంతగా ఇష్టపడరు. అందువల్ల దీనిని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసుకుంటే సూప్ తయారవుతుంది.