చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే.. ఇంట్లోనే ఈ సౌందర్య చిట్కాలను పాటించండి. శెనగ పిండి, పసుపు పొడి, నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పాలతో కలిపి ముఖానికి రాసుకుని.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
నల్లగా ఉన్నవారు పొటాటో జ్యూస్‌ను ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మ ఛాయను పెంపొందించుకోవచ్చు. గుమ్మడి ముక్కలను కంటి చుట్టూ ఉంచి 10 నుంచి 20 నిమిషాల వరకు ఉంచి ఆపై కడిగేస్తే కంటి కిందటి వలయాలను దూరం చేసుకోవచ్చు. బొప్పాయి పండు గుజ్జును ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలుండవు.
తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాస్తే నల్లటి పెదవులకు చెక్ పెట్టవచ్చు. ఇంకా గులాబీ రేకుల్లాంటి పెదాలను పొందవచ్చు. పెరుగుతో, శెనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఏర్పడే ముడతలను తగ్గించుకోవచ్చు.