వ‌ర్షాకాలంలో డ్రై స్కిన్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీ...

సోమవారం, 1 ఆగస్టు 2016 (16:56 IST)
భయంకరమైన వేసవి ఎండల తర్వాత వాతావరణాన్ని చల్లబరుస్తూ వర్షాకాలం వచ్చేసింది. అయితే వర్షాకాలం వచ్చే పాజిటివ్ థింక్స్ చాలానే ఉన్నప్పటికీ.. నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. వర్షాకాలం డ్రై స్కిన్ సమస్యను నివారించే సింపుల్ రెమెడీ కోసం అవకాడో, కొబ్బరినూనెను తీసుకోవాలి.
తయారు చేసుకునే విధానం:
* అవకాడో నుంచి గుజ్జు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.
* ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమానంగా ముఖంతో పాటు, శరీరంలో ఎక్కడైనా పట్టించుకోవచ్చు. 
* 20 నిమిషాల తర్వాత మైల్డ్ బాడీ వాష్ ఉపయోగించి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
తరచుగా ఈ ప్యాక్ ట్రై చేస్తే.. డ్రై స్కిన్ దూరమవుతుంది. స్మూత్‌గా మారుతుంది. చర్మాన్ని సహజసిద్ధంగా మార్చి, హైడ్రేట్ చేస్తాయి. డ్రైనెస్‌ని నివారించి చర్మానికి కావాల్సినంత మాయిశ్చరైజర్ అందిస్తాయి. ఈ రెండింటినీ మిక్స్ చేయడం వల్ల.. మాయిశ్చరైజర్ స్థాయిలతో పాటు, పిహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. అంటే మీ చర్మం పొడిబారడం తగ్గి స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మారుతుంది. డ్రై ప్యాచెస్ నివారించబడతాయి.

వెబ్దునియా పై చదవండి